తళతళలా మెరుస్తూ కళకళ లాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న వినాయకుడి రూపం భక్తులను ఆకట్టుకుంటుంది. స్థానిక కోర్టు రోడ్డు ప్రాంతంలో శక్తి యువక మండలి సభ్యులు ఈ కరెన్సీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రతి ఏటా పూజకు అవసరం అయ్యే సామాగ్రితోనే, ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడు విగ్రహం తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.