వినూత్నంగా MLA వివాహ వార్షికోత్సవ వేడుకలు..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి-మాధవి దంపతులు సామాజిక సేవతో ప్రజాదరణ పొందారు. కష్టకాలంలో తన వెన్నంటి నడిచిన జీవిత భాగస్వామి ముచ్చటి తీర్చేందుకు ఆయన ఆదివాసి ఆచారాలతో వెరైటీగా పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవాలని భావించారు. ఇంకేముంది తన 32వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి అడవి బాట పట్టారు.