UPలోని కన్నౌజ్‌లో ఓ యువతి చేతిలో తుపాకీ పట్టుకొని రీల్స్ చేసింది. ఈ ఘటన ఛిబ్రామౌ ప్రాంతంలోని జాతీయ రహదారి 34పై చోటుచేసుకుంది. తుపాకీ చేతపట్టి తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పోలీసులు సుమోటోగా స్పందించి విచారణ ప్రారంభించారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.