ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు శాకంబరీగా దుర్గమ్మ దర్శనం

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు అంటే మూడు రోజుల పాటు ఈ శాంకంబరి ఉత్సవాలను నిర్వహించానున్నారు. ఈ మూడు రోజులు దుర్గమ్మ కూరగాయలను అలంకరించుకుని శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 21 వ తేదీతో ముగుస్తాయి. అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఈ శాకంబరి ఉత్సవాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కూరగాయలను అమ్మవారికి విరాళంగా ఇస్తారు. కనక దుర్గమ్మ ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను, అమ్మవారిని పూర్తిగా కూరగాయలతో అలంకరిస్తారు.