'కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే'.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..

వేములవాడకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధానితోపాటు హెలిప్యాడ్ వద్దకు మరో నాలుగు హెలికాప్టర్లు చేరుకున్నాయి. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు హుజూరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు అయన.