ఉచిత బస్సులో ఎల్లిపాయ పొట్టు తీయడం తప్పా?.. మంత్రి సీతక్క

బస్సుల్లో మహిళలు ఎల్లిపాయ, అల్లం పొట్టు తీయడం తప్పెలా అవుతుందంటూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క ప్రశ్నించారు. అల్లం ఎల్లిపాయ తీస్తే అదేమైనా తప్పా? ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేయడం ఎందుకని బస్సులో ఎల్లిపాయ వలుచుకున్నారేమో? దీన్ని కూడా వీడియో తీసి తప్పుగా చూపించిండ్రు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు కుట్లు అల్లికలు ఇవన్నీ మహిళలకు జీవనాధారం. అదిలాబాద్‌ నుంచి రావాలంటే 4 -5 గంటల జర్నీ. ఆమె ఇంటి దగ్గర ఉంటే ఆ పని చేసుకునేది. ఖాళీగా ఉండటం ఎందుకని బస్సులో రెండు పనులు అయితయని ఎల్లిపాయ ఒలుచుకుందేమో. వీటన్నింటినీ చూపించి.. అసలు మహిళలకు ఉచిత ప్రయాణమే వృద్ధా అని చెప్పడం కరెక్ట్‌ కాదని అన్నారు.