తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ పరిసరాల్లో ఓ కుక్కను చిరుత వెంటాడింది. చిరుత సంచారాన్ని గుర్తించిన కుక్క పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేందుకు ప్రయత్నించింది. అయితే.. కుక్క అరుపులతో అలర్ట్ అయిన చిరుత రివర్స్ ఎటాక్ చేసి.. కుక్కను వెంటాడడంతో అక్కడినుంచి పరుగులు తీసింది. వర్సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమార్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.