బిందె నీటి కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే..గుండెల్ని పిండేస్తున్న దృశ్యం..!

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బోరిచివారి గ్రామంలో చుక్క నీటి కోసం మహిళలు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. బిందె నీటి కోసం మహిళలు సమీపంలో ఉన్న బావి వద్దకు చేరుకొని నీటిని తోడుకోవాల్సి వస్తుంది. అయితే బావిలో కూడా నీరు అడుగంటడంతో ఓ మహిళ బావి లోపలికి దిగి బిందెను నింపితే కాని తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. బావి లోపలికి దిగే క్రమంలో కొద్దిగా అదుపుతప్పినా సదరు మహిళకు ప్రమాదం తప్పదు.