ఆదిమానవులు తమ సమూహంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని కాల్చివేసి లేదా పూడ్చిన ప్రాంతంలో ఒక రాతిబండను పేరుస్తారు. దానిపై చిన్న చిన్న బండలను ఆధారంగా ఉంచి దాని పైభాగంలో వెడల్పయిన పెద్ద రాతి బండను అమర్చేవారు. ఈలాంటి అమరికను రాక్షస గుహలు లేదా డాలమిన్‌గా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈలాంటి గుహలను సాధారణంగా బ్రిటన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్కాండినేవియా, ఐర్లాండ్ దేశాల్లో పురావస్తుశాఖ అధికారులు కనుగొన్నారు. ఈలాంటి రాక్షస గుహలు మనదేశంలో కూడా ఇటీవల బయట పడుతున్నాయి.