కొంత మంది పాము పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడతారు.. అదే పాము కళ్ళ ముందు కనిపిస్తే ఇంకేమైన ఉందా.. గుండెలు జారీపోవాల్సిందే.. కానీ అంతటి భయంకరైన పాములను అలవోకగా పట్టేసి వాటి బారి నుంచి జనాలను రక్షిస్తుంటారు స్నేక్ క్యాచర్లు. అంతేకాదు వాటికి కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఒక్క ఫోన్ కొడితే చాలు.. క్షణాల్లో వాలిపోయి ఆ పాములను పట్టుకుంటున్నారు. తర్వాత వాటిని జనాలకు దూరంగా సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలేస్తారు, లేదా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో అప్పగిస్తారు. ఇలానే విశాఖ జిల్లాలో ఉండే ఓ స్నేక్ క్యాచర్ రెండు రోజుల్లో ఏకంగా నాలుగు పాములు పట్టుకున్నాడు.