Stampede in Kochi University: కొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (CUSAT) వార్షికోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. వార్షికోత్సవంలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్ధులు దుర్మరణం చెందారు. దాదాపు 64 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొచ్చి యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా యూనివర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో శనివారం రాత్రి ప్రముఖ గాయని నికితా గాంధీ మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు.