పహల్‌గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మొదలైన తొలి తెలుగు సినిమా షూటింగ్

ఉగ్రదాడులతో క్షోభకు గురైన ఆ లోయ మళ్లీ కళల స్వర్గంగా మారుతోంది. పహల్‌గాం ఘటన తర్వాత మొదటగా అక్కడ అడుగుపెట్టిన సినిమా యూనిట్ కూడా తెలుగుదే కావడం విశేషం. ఉగ్రదాడి మిగిల్చిన గాయాల మధ్య మళ్లీ కెమెరా రోలింగ్ ప్రారంభమవడంతో స్థానిక కశ్మీరీలకు ఉపాధి, పర్యాటక రంగానికి ఊపిరి, లోయకు మరోసారి జీవం లభించింది.