వామ్మో.. పెట్రోల్‌ కొట్టిస్తుండగా కార్లో మంటలు.. తెలివిగా డ్రైవర్‌ ఏం చేశాడో చూడండి..

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ మెట్రో సమీపంలో ఉన్న బీపీసీఎల్ పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి తన కారులో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు వచ్చాడు. సిబ్బందిని పెట్రోల్‌ ఫిల్‌ చేయమని అడిగాడు. సిబ్బంది పెట్రోల్‌ పొద్దామని వెళ్తుండగా ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో భయపడిపోయిన కారులో ఉన్న ఇద్దరు బయటకు దిగిపోయారు. మంటలు చెలరేగడంతో బంకులో మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై తమ వద్ద ఉన్న అగ్నిమాపక యంత్రాలు వెంటనే మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.