క్షణకాలం.. చిన్న తప్పిదం.. పోయిన ప్రాణం..

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో బ్యాడ్మింటన్ ఆడుతున్న 14 ఏళ్ల బాలుడు, షటిల్‌ కాక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో దాన్ని రాకెట్‌తో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగలడంతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.