సలాం రిక్షా వాలా..!

రహదారిపై గుంతలను అధికారులు పట్టించుకోకపోవడంతో తన కళ్లెదుటే ఎన్నో ప్రమాదాలు జరిగి వాహనదారులు ఆసుపత్రి పాలయ్యారని రషీద్ చెబుతున్నాడు. తట్టెడు మట్టి పోస్తే పోయే పనికి లక్షల్లో ఆసుపత్రి బిల్లులు కట్టడం మంచిదా అని ప్రశ్నించుకున్నానని.. అందుకే గుంతలను పూడ్చానని అంటున్నాడు రిక్షా కార్మికుడు. మరి బాధ్యత ఎరిగి పౌరునిగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచిన రిక్షా అన్నకు వేసుకుందాం ఒక సలాం..!