శునకంపై స్వారీ చేసిన చిన్నారి.. వీడియో వైరల్

హెవీ గార్డ్స్, బ్లాక్ SUVలతో వీఐపీలు తిరిగే యుగంలో ఓ చిన్నారి "Z+ సెక్యూరిటీ"కి కొత్త అర్థం ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, ఆరోగ్యంగా కనిపిస్తున్న ఓ వీధి కుక్కపై స్వారీ చేస్తూ, చుట్టూ ఆరు నుంచి ఏడు వరకూ ఇతర కుక్కలు ఆమె వెంట నడుస్తుండటాన్ని చూడొచ్చు. మొదట చూస్తే కుక్కలతో కలిసి నడుస్తుందనిపించినా, ఆ బాలిక కుక్కపై స్వారీ చేస్తూ ఆ వీధిలో రాజ కుమార్తెలా కనిపించడం ఆ వీడియో ప్రత్యేకత.