పాడు బడ్డ బావిలో ఐదు రోజులుగా నాగుపాము.. చివరికి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో ఐదు రోజుల క్రితం ఓ పాము ఉండటాన్ని గుర్తించారు స్థానికులు. ఐదు రోజుల నుంచి అది పైకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ సాధ్యపడటం లేదు. నీరసించి... బావిలోనే తచ్చాడుతుడున్న పాము గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. వారు పాములను రెస్క్యూ చేసే స్నేక్ క్యాచర్ భార్గవ్‌కు సమాచారం అందించారు.