హైదరాబాద్ పాతబస్తీలోని చంచల్‌గూడకు చెందిన మహ్మద్ ఫారూఖ్ తన బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో బంక్ దగ్గరికి వెళ్లి దాదాపు 3 గంటలకుపైగా క్యూలో వేచిచూశాడు. ఎంతకీ పెట్రోల్ దొరకపోవడం, పైగా డెలివరీ సమయం అవుతుండటంతో వినూత్నంగా ఆలోచించాడు. ఎలాగైనా ఫుడ్‌ను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో తన అన్న దగ్గరికి వెళ్లి బైక్‌ను అక్కడ పెట్టి సోదరుడి దగ్గర ఉన్న గుర్రాల్లో ఒకటి తీసుకుని రోడ్లపై పరుగులు పెట్టించాడు.