చేపల జాతర.. ఊరంతా పండుగ!

చెరువుల్లో నీరు అడుగంటుతుండటంతో చేపలు పట్టేందుకు జనం ఎగబడుతున్నారు. పల్లెల్లో కనిపిస్తున్న దృశ్యాలు చెరువుల జాతర తలపిస్తోంది. ఈ క్రమంలోనే కుర్నవల్లి పెద్ద చెరువులో జల పుష్పాల జాతరలో భాగంగా చేపల వేటకు జనం ఎగబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించేవారు. ఆ క్రమంలోనే పంటలు పండించేందుకు చెరువులు నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ఈ చెరువులని ఆధారంగా చేసుకుని సాగు చేస్తున్నారు ఇక్కడ ప్రజలు.