రైలు పట్టాలపై కారు నడుపుతూ హల్‌చల్‌ చేసిన యువతి..

రంగారెడ్డి జిల్లాలో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి హల్‌చల్ చేసింది. డ్రగ్స్, మద్యం మత్తులో కారును ఏకంగా రైలు పట్టాలపై నడిపింది.. నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో రైలుపట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ భయాందోళనకు గురిచేసింది.. దీంతో రైళ్లను సైతం ఆపివేశారు.