రెప్పపాటులో ప్రమాదం.. విద్యార్థులంతా సేఫ్..! స్కూల్ బస్సుల ప్రమాదాలు గురించి నిత్యం చూస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఏదో ఒక స్కూల్ బస్సు ప్రతిరోజు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి గుంతలోకి దూసుకువెళ్ళింది. ఆ సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు.