ఇప్పటికీ అదే వైబ్.. మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్..

ఇప్పటికీ అదే వైబ్.. మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా ఇంద్ర . ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తెలుగు ఇండస్ట్రీలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. బీ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ గా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా చూస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ టికెట్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. ఇక ఇంద్ర సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం సినిమాకే హైలైట్..