పురాతన శ్రీలక్ష్మి దేవి ఆలయంలో భారీ చోరీ.. రాత్రికి రాత్రే నగలతో పరార్‌!

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రం ముదిరాజ్ కాలనీలో పురాతన శ్రీలక్ష్మి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గురువారం రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో గుడిలో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు, 4.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ.35వేల నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయం సంఘం పెద్దలు తెలిపారు. విషయం తెలుసుకున్న శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఆధారాలు సేకరించారు.