కోనసీమలో మంచు అందాలు.. పచ్చని కొబ్బరి చెట్ల ప్రకృతి సోయగాలు!

అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, అమలాపురం పరిసరాల్లో రోజు రోజుకు మంచు పెరిగిపోతోంది. మంచు అందాలతో కోనసీమ కొత్త అందాలను సంతరించుకుంటుంది.పచ్చని కొబ్బరి చెట్లపై స్నోఫాల్ చూపరులను కట్టిపడేస్తుంది. ఉదయ 9 గంటలు దాటినా మంచు తగ్గకపోవడంతో ప్రకృతి ప్రేమికుల మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. కవి కూడా వర్ణించలేని అద్భుతమైన ప్రకృతి సహజ సిద్ధమైన అందాలు కోనసీమ సొంతం అంటూ మురిసిపోతున్నారు కోనసీమ వాసులు. ఈరోజు ఉదయం అంబెడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో కనిపించిన మంచు అందాలు టీవీ9 కెమేరాకు చిక్కాయి. కోనసీమ ఒక్కసారిగా కేరళ , ఊటీ, కోడైకెనల్ , లంబసింగి అందాలు కోనసీమ అంబాజిపేటలో కనిపించాయి.