స్వాతంత్ర్య దినోత్సవం అంటే.. కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆగస్టు 15.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమని, భారతీయులకు ఒక గొప్ప పండుగ రోజు అని తెలిపారు. వారి త్యాగాలను యువతరం తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ బేగంబజార్‌లో భగత్‌సింగ్ యువసేన ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.