పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలోని ఎర్రకుంట చెరువులో నీటి బుడగ పక్షులు సందడి చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులో వేల పక్షులు చేస్తున్న విన్యాసాలు వీక్షకులను కట్టి పడేస్తున్నాయి. ఏటా ఇలా పక్షులు వచ్చి చెరువులో సందడి చేస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు.