ఎండాకాలంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు సరిపడా నీరు జలాశయాల్లో ఉన్నాయని హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో నీటి అవసరానికి 2300 mld ల నీరు అవసరం వినియోగిస్తుండగా ప్రస్తుతం 2450 mld ల నీరు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తానికి అవసరాన్ని బట్టి 700 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని గత ప్రభుత్వం కన్నా ఎక్కువగానే నీటిని సరిపడా చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాదులో ప్రస్తుతం 700 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి అన్నారు.