పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతాలో జరిగిన దారుణ ఘటన యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. జూనియర్ డాక్టర్‌పై మెడికల్ ఆస్పత్రిలోనే జరిగిన ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన చేపట్టారు. మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కీలక నిర్ణయం తీసుకుంది.