విద్యుత్తు అవసరం లేకుండా డీజిల్ తో పనిచేస్తుండగా, ఎక్కడికైనా తీసుకెళ్లి పిండి పట్టేలా ఏర్పాటు చేశారు. తనకున్న ట్రాక్టర్ ను పిండి పట్టే గిర్నీగా అనుసంధానించాలని ఆలోచించాడు మాజిద్. తను 7వ తరగతి వరకు స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకొని అంతటి తోనే చదువును ఆపేశాడు.అనంతరం ఒక బైక్ మెకానిక్ షాప్ లో కొన్నాళ్ళు పని చేశాడు. తర్వాత స్వంతంగా చిన్నగా పిండి గిర్ని పెట్టుకున్నాడు.