దారుణం.. ప్రిన్సిపల్ మందలించాడనీ స్కూల్‌ భవనంపై నుంచి దూకిన విద్యార్ధి!

ఒకప్పుడు విద్యార్ధులు అల్లరి చేస్తే స్కూల్లో టీచర్లు రకరకాల శిక్షలు విధించి వారిని సరైన మార్గంలో పెట్టేవారు. మరీ పెంకి పెల్లలైతే నాలుగు దెబ్బలు తగిలించి బుద్ధి చెప్పేవారు. కానీ నేటి కాలంలో పరిస్థితి వేరేలా ఉంది. పల్లెత్తిమాటంటే చాలు విద్యార్ధులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు తల్లిదండ్రులు కూడా టీచర్లపై కేసులు పెట్టే వరకు వెళ్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా పిల్లలను సరైన మార్గంలో ఎలా పెట్టాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా పదో తరగతి విద్యార్ధిని ఓ స్కూల్ ప్రిన్సిపల్ మందలించాడన్న కోపంతో ఆ విద్యార్ధి దారుణానికి పాల్పడ్డాడు.