గోదావరిలో తొలి పులస దొరికిందోచ్.. ఎంత పలికిందో తెల్సా..? పులసల సీజన్ వచ్చేసినట్టే.. వచ్చేసినట్టే కాదు.. వచ్చేసింది. అప్పుడే మొదటి పులసను పట్టేశారు కూడా. గోదావరి జిల్లాల ప్రజలు ఈ పులసల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. పుస్తెలు అమ్మి అయినా పులసను తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్త అల్లుళ్లకు, బంధువులకు పులసలతో విందు చేస్తారు. ఈక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది.