దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కచ్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు మిఠాయిలు తినిపించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ ఆర్మీ డ్రెస్‌లో కనిపించడం విశేషం. అనంతరం సర్ క్రీక్ ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం అనవాయితీ వస్తోంది. ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారు