అరుదైన చీరమేను సందడి

యానాం: శీతాకాలం ప్రారంభం కావడంతో యానాం మార్కెట్‌లో అరుదైన చీరమేను సందడి మొదలైంది. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఈ చేపలు ఈ ఏడాది తొలిసారిగా మార్కెట్‌కు చేరడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. తొలి బకెట్‌ చీరమేను వేలంలో ఏకంగా రూ.26 వేలకు అమ్ముడైంది. స్థానిక మత్స్యకార మహిళ నాటి పార్వతి ఈ బకెట్‌ను వేలంలో దక్కించుకున్నారు. అనంతరం చీరమేనును సేరు రూ.4 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. దీంతో మార్కెట్‌లో చీరమేను కొనుగోలు చేసేందుకు మాంసాహార ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.