కార్గిల్ యుద్ధానికి నేటితో 25 ఏళ్లు.. ఈ సందర్భంగా నాటి విజయాన్ని, అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ 'విజయ్ దివస్'ను నిర్వహించుకుంటున్నాం. పాకిస్థాన్ మూకల్ని కార్గిల్ నుంచి తరిమికొట్టిన ఈ రోజు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఓ విద్యార్థి అద్భుతమైన ప్రతిభతో కార్గిల్ వీరులకు ఘనంగా నివాళిలర్పించారు.