పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘బ్లాక్ అవుట్’

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమృత్‌సర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భద్రతా కారణాలకై అక్కడ అధికారులు తరచుగా ‘బ్లాక్ అవుట్’ అమలు చేస్తున్నారు. హెచ్చరికలిచ్చిన వెంటనే ప్రజలు ఇళ్లలోని లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ప్రజలు ఆందోళన చెందకుండా, గుమిగూడకుండా ఇంట్లోనే ఉండాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రజల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.