కవితకు ధైర్యం చెప్పారు కేటీఆర్‌

లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రెండు రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఢిల్లీ లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు కవిత విచారణ జరిగింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కలిశారు. కేటీఆర్‌తో పాటు కవిత భర్త అనిల్‌ , ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కూడా సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కవితకు ధైర్యం చెప్పారు కేటీఆర్‌.