చింతూరు మన్యం ప్రాంతంలో కనువిందు చేస్తున్న పొగ మంచు అందాలు

అల్లూరి జిల్లా చింతూరు ఏజన్సీని మంచు దుప్పటి కప్పేస్తోంది. బారెడు పొద్దెక్కినా మంచు ముసుగు తీయడం లేదు. దీంతో ఏజన్సీ వాసులను చలి పులిలా వణికిస్తోంది. గత వారం రోజులుగా తీవ్ర మంచు ప్రభావంతో జనం గజ గజ వణికిపోతున్నారు