తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్ఎస్ ను ఇటీవల బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దేశ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌తో ఆవిర్భవించిన టీఆర్ఎస్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు.