వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ తిరుగులేని శక్తిగా ఎదగబోతుందిః అశ్విని వైష్ణవ్

వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ తిరుగులేని శక్తిగా ఎదగబోతుందిః అశ్విని వైష్ణవ్ ఆర్థిక మాంద్యం సమయంలో సైతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పునర్ఘాటించారు. పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్, శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన గుర్తు చేశారు. బ్రిటన్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలదీ అదే పరిస్థితి. అక్కడ కూడా వృద్ధి రేటు నత్త నడకన సాగుతోంది. వచ్చే పదేళ్లలో భారత్ ఆరు నుంచి ఎనిమిది శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందిన దేశంగా అవరించబోతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.