ఇంట్లోకి దూరి బుసలుకొడుతూ హల్చల్ చేసిన ఏడు అడుగుల కోడెనాగు పామును పట్టుకునేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ సైతం హడలెత్తిపోయాడు. చుట్టుపక్కల వారికి వినిపించేలా బుస కొట్టిన కోడెనాగు జనాల గుండెల్లో వణుకు పుట్టించింది. వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావం వలన అడవుల్లో ఉండాల్సిన కోడే నాగులు, కొండచిలువలు జనావాసాల మధ్య సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవి ప్రాంతానికి సమీపంలో ఉండే మహానంది మండలం నిత్యం ఎదో ఒక గ్రామంలో నాగుపాములు, కొండచిలువలు హల్ చల్ చేస్తుంటాయి.