నడవలేక అవస్థపడుతున్న గోవు.. పరీక్షించిన డాక్టర్ షాక్! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డుపై పడి ఉన్న ఒక గోవును చూశాడు స్థానిక న్యాయవాది బోయ తిమ్మప్ప. భారీ కడుపుతో ముక్తాయాసంతో నడవలేక అవస్థపడుతున్న గోవును చూసి చలించిపోయాడు. ఆవును చూసి తన దారి తాను పోలేక స్థానిక పశు వైద్య అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పశు వైద్యులు హుటాహుటీన అక్కడికి చేరుకుని గోవు పరిస్థితిని గమనించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అక్కడికక్కడే ఆవుకు శస్త్రచికిత్స చేసి, దాని కడుపులో నుంచి 70 కేజీల పైగా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగించారు. దీంతో చావు బతుకుల్లో ఉన్న గోవుకు పశువైద్యులు ప్రాణభిక్ష పెట్టారు.