టిప్ టాప్‌గా విమానంలో వచ్చారు.. కట్ చేస్తే, ప్యాంటు లోపల.. టిప్ టాప్‌గా విదేశాల నుంచి వచ్చారు.. వీళ్లంతా ఎంత మంచొళ్లో అనుకున్నారు.. అంతలోనే అనుమానం రావడంతో పోలీసులు ఆపి చెక్ చేశారు. ఇంకేముంది.. వాళ్ల అసలు బాగోతం బయటపడింది.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సహా విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు 20 కేసుల్లో 12.74 కేజీల బంగారంతో పాటు రూ.8.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు