అతనొక బాధ్యతగల హాస్టల్ వార్డెన్. చదువుకోడానికి వచ్చిన పిల్లలను హాస్టల్లో జాగ్రత్తగా చూసుకుంటూ... చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న పిల్లలను కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంది. వీటన్నింటికి భిన్నంగా... ఏకంగా హాస్టల్‌లోనే బార్ ఓపెన్ చేశాడు. అనంతపురంలోని సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్ వార్డెన్ బాగోతం ఇదీ. సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్‌లో వార్డెన్‌గా ఉన్న విజయ శంకర్ వరప్రసాద్ గది చూసిన వాళ్ళు ఎవరికైనా ఇది కచ్చితంగా బార్ అనే విధంగా మద్యం బాటిల్స్ ఉన్నాయి. రోజు హాస్టల్‌కు మద్యం తెచ్చుకొని తాగి విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు చావబాదుతున్నాడట.