హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రతిష్టాత్మక నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి సింహం బయటికి వచ్చినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహం జనావాస ప్రాంతాల్లోకి వచ్చిందని.. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ఖాతాల్లో పెద్దఎత్తున పోస్టులు రావడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పోస్టులను చూసిన కొందరు ప్రజలు భయభ్రాంతులకు గురి కావడంతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.