శ్రీకాకుళం జిల్లాలోని, కవిటి మండలం, మధ్యపుట్టుగ గ్రామ శివారులో శుక్రవారం(ఆగస్టు 01) ఓ నాగుపాము హల్చల్ చేసింది. సుమారు 7అడుగుల పొడవు ఉన్న నాగరాజు నడి రోడ్డుపై పడగవిప్పి బుసలు కొడుతూ.. అటూ ఇటూ చూస్తూ అటుగా వెళ్ళే వారిని భయాందోళనకు గురిచేసింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 10నిముషాల పాటు రోడ్డుపై నిరీక్షించి, ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని సృష్టించింది.