భయంతో వణికిపోతున్న అడవి బిడ్డలు..!

అడవుల జిల్లా ఆదిలాబాద్ వన్య మృగాల సంచారంతో వణికిపోతోంది. కవ్వాల్ అభయారణ్యంలో ఇప్పటికే పులి ఎంట్రీ ఇచ్చిందన్న సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు మహారాష్ట్ర తడోబా, తిప్పేశ్వరం అభయారణ్యాల నుండి పులుల వలస.. ప్రాణహిత దాటోచ్చేందుకు‌ సిద్దంగా ఉన్న మదపుటేనుగుల గుంపుతో ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంత వాసుల భయం అమాంత పెరిగిపోతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల సమీప అటవీ ప్రాంతంలో పులి సంచారం టెన్షన్ పెడుతోంది.