పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్..!

నిర్మల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డ్ స్థాయి‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోడ్డెక్కితే చాలు మాడు పగిలిపోతోంది. ఎండ తీవ్రతకు వడగాలులు తోడవడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. రాష్ట్రంలోనే రికార్డ్ స్థాయి 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ దెబ్బకు ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డుపైనే ఖాళీ బూడిదవుతున్నాయి. పెట్రోల్ వాహనాలు సైతం ఎండ తీవ్రతకు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో అలర్ట్ అయి‌న ఓ పెట్రోల్ బంక్ యజమాని ఎండ తీవ్రత నుండి బంకు ను కాపాడుకునేందుకు ఎక్కడికక్కడ కూలర్లను ఏర్పాటు చేశాడు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే ప్రయాణికులకు కాసేపు సేద తీరేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు.