జాగిలం షైనీకి పోలీస్ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు..!

షైనీ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. యస్‌.. అదే పోలీస్‌ డాగ్‌. ఉమ్మడి ఖమ్మం జిల్లా డాగ్‌స్క్వాడ్‌గా దాదాపు పదేళ్లుగా సేవలందించింది. ఎన్నో కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించింది. కానీ.. ఇప్పుడు షైనీ లేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. విశ్వాసానికి మారుపేరైనా షైనీ అంత్యక్రియలను పోలీసులు ఘనంగా నిర్వహించారు. షైనీ మృతి తీరని లోటని పోలీసులు దాని సేవలు కొనియాడారు.