శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్మ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి బదులు వీధి రౌడీలా కుర్చీలో కూర్చుని పిల్లలతో కాళ్లు పట్టించుకుంది. కుర్చీ వెనక్కి వాలి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ విలాసవంతంగా సమయం గడపసాగింది. ఇద్దరు విద్యార్థినులతో చెరొక కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈఘటన పై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామన్నారు. మరో వైపు ఆ ఉపద్యాయురాలు మాత్రం కాలుబెనికింది విద్యార్థులు సహాయం చేస్తున్నారని చెప్పుకురావడం విశేషం.