మోదీని సజీవ సమాధి చేస్తారట..!

మోదీని సజీవ సమాధి చేస్తారట..! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు శివసేన (యూబీటీ)ని కూడా తీవ్రంగా దుయ్యబట్టారు. నకిలీ శివసేన వ్యక్తులు నన్ను సజీవ సమాధి చేయాలని చూస్తున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈ వ్యక్తులు మోదీ సమాధి తవ్వుతానంటున్నారు. మోదీని మట్టి కరిపిస్తామంటూ కలలు కంటున్నారు. వారి రాజకీయ దురుద్ధేశ్యం ఎంతగా దిగజారిందో తెలుసుకోవాలన్న మోదీ, దేశంలోని తల్లులు, సోదరీమణులు రక్షణగా ఉన్నంతవరకు ఎవరు ఏం చేయలేరన్నారు.